కరోనా కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగా మే 03 వరకు కేంద్రం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో మూడు రోజుల్లో లాక్ డౌన్ గడువు ముగుస్తుండడం తో ప్రజల్లో లాక్ డౌన్ పొడిగిస్తారా..లేక ఎత్తేస్తారా అని అంత మాట్లాడుకుంటున్నారు. మే 2వ తేదీన ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని, లాక్ డౌన్ పై నిర్ణయం తెలుపుతారని సమాచారం. అయితే లాక్ డౌన్ కొనసాగింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది ఇలా ఉంటే, తెలంగాణలో డిసెంబర్ వరకు పొడిగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ముందు జాగ్రత్తతో మే 7 వరకు లాక్డౌన్ను పెట్టారని…మరి కొన్ని నెలలు లాక్డౌన్ను పొడిగించాలని ఆయన కోరారు. లాక్డౌన్ ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయని… కరోనా కేసులు పెరగకుండా ఉండాలంటే లాక్డౌన్ పొడిగించాల్సిందేనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.