మళ్లీ రాజకీయాల ఎంట్రీ ఫై చిరంజీవి ఫుల్ క్లారిటీ ..

మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై రారాజుగా వెలుగుతున్న సమయంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లారు. కానీ తెరపై రారాజు అనిపించుకున్న చిరు..రాజకీయాల్లో మాత్రం జీరో రాజు అనిపించుకున్నాడు. ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఘోరంగా ఓటమి చెందడం తో అతి తక్కువ టైంలోనే కాంగ్రెస్ లో ఆ పార్టీ ని కలిపి చేతులు దులుపుకున్నారు.

ప్రస్తుతం మళ్లీ ఇండస్ట్రీ లో అడుగు పెట్టి వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. తాజాగా లాక్ డౌన్ తో సినిమా షూటింగ్ లన్ని బంద్ కావడం తో ఓ వెబ్ సైట్ కు ఇంటర్వ్యూ ఇచ్చి పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసాడు. ఇక రాజకీయాలను వదిలేసినట్టేనా?? అన్న ప్రశ్నకు క్లియర్ కట్‌గా ఎస్.. రాజకీయాలను వదిలేసినట్టే అంటూ ఆన్సర్ ఇచ్చారు చిరంజీవి. తన కుటుంబానికి సంబంధించి తన తమ్ముడు పవన్ పాలిటిక్స్‌లో ఉన్నాడని.. మిగిలిన వాళ్లు అతనికి మద్ధతు ప్రకటిస్తామన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘అన్న ఒకవైపు తమ్ముడు మరోవైపు ఉంటే మమ్మల్ని అభిమానించి గుండెల్లో పెట్టుకున్న అభిమానులు అయోమయంలో ఉండే పరిస్థితి ఉంది. ఇక అలాంటి పరిస్థితి ఉండకూడదు. అందుకే నేను నా తమ్ముడు స్థాపించిన ‘జనసేన’ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నాను. అతని పట్టుదల గురించి నాకు తెలుసు. ఈరోజు కాకపోతే రేపటి రోజునైనా తాను అనుకున్నది సాధిస్తాడు. ఒక అన్నగా పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా మా కుటుంబం కళ్యాణ్‌ని సపోర్ట్ చేస్తుంది’ అని తెలిపాడు.