లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఇంటికో రెండు కిలోల కోడి.. 10 గుడ్లు అందజేస్తున్న సర్పంచ్ ..

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా మే 03 వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ముఖాయమంత్రి కేసీఆర్ మే 07 వరకు లాక్ డౌన్ పొడిగించారు. ఇప్పటికే గత నెల రోజులుగా ఏ పనిలేక ఇంట్లోనే ఉంటున్న ప్రజలు ఆర్ధికంగా చాల ఇబ్బంది పడుతున్నారు. కుటుంబ పోషణ కూడా భారంగా మారింది.

ఈ నేపథ్యంలో తమ గ్రామ ప్రజలెవరూ ఇబ్బంది పడొద్దని సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని గుంతపల్లి సర్పంచ్ సుమిత్ర తన పెద్ద మనుసుతో గతంలోనే నెలకు సరిపడా 14 రకాల నిత్యావసర వస్తువులు, కూరగాయలు రెండుసార్లు పంపిణీ చేశారు. ఇప్పడు తాజాగా గ్రామంలోని ప్రతి ఇంటికీ రెండు కిలోల కోడి, 10 గుడ్లు అందజేయడం స్టార్ట్ చేసారు. వీటితో గ్రామస్థులకు పోషకాహారం అందుతుందని, తద్వారా రోగనిరోధక శక్తి పెరిగి.. కరోనాను ఎదర్కొగలరని ఆమె తెలిపింది. సర్పంచ్ చేస్తున్న మంచి పని చూసి చాలామంది ఆమెను మెచ్చుకోవడం స్టార్ట్ చేసారు.