టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని జగన్ సర్కార్ పై మండిపడ్డారు. “కరోనా లాక్ డౌన్ వేళ సామాన్య ప్రజల మీద మీ సర్కారు లాఠీలు విదిలిస్తోంది. కానీ, బాధ్యతను విస్మరించి, పబ్లిసిటీ కోసం గుంపులు, గుంపులుగా ట్రాక్టర్ ర్యాలీలు, పూలవర్షాలు, రిబ్బన్ కటింగులు చేస్తున్న మీ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల చర్యలపై ఏం సమాధానం చెబుతారు సీఎం గారూ!” అంటూ ప్రశ్నించారు.
అలాగే నార లోకేష్ కూడా జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. సమస్యలు చెబుతున్న ప్రతిపక్షంపై, అలాగే, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్న మీడియాపై ఎదురుదాడికి పాల్పడుతున్నారంటూ లోకేశ్ మండిపడ్డారు. వాస్తవాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయన్న విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలని అన్నారు.