నాలుగు రోజుల క్రితం పుత్తూరులో బోర్ ఓపెనింగ్ కి వెళ్లిన సందర్భంగా తాను నడుస్తుంటే తన ముందు పూలు చల్లించుకున్న సంఘటన రోజాకు పెద్ద తలనొప్పిగా మారింది. ఆ సంఘటన మీద రోజా పదే పదే వివరణ ఇవ్వాల్సి వస్తోంది.
ఈ విషయమై రోజా స్పందిస్తూ, ఈ కార్యక్రమం మూడు రోజుల కిందట జరిగిందని, ఇందుకు సంబంధించిన పూర్తి వీడియోను ప్రసారం చేయకుండా, టీడీపీ నాయకులకు, పచ్చ ఛానెళ్లకు కావాల్సిన భాగాన్ని ప్రసారం చేసుకుని తమపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు.
పచ్చ ఛానెళ్లలో తనపై డిస్కషన్ కూడా పెట్టారని, ఎన్నికల్లో తనపై పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి తనపై విమర్శలు చేశారని అన్నారు. టీడీపీ పాలనలో పుత్తూరును ఏమాత్రం అభివృద్ధి చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు