కొత్తగా అలోచించమంటున్న కేటీఆర్

కరోనాకు మందు లేదు. నివారణే మార్గం. ఆ నివారణ ఎలా..? లాక్ డౌన్ వర్కవుట్ అవడం లేదు. సోషల్ డిస్టాన్సింగ్ పని చేయడం లేదు. మరి ఎలా.. వైరస్ ను ఎదుర్కోవాలి. దీనిపై మాట్లాడారు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ . కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వినూత్న ఆలోచనలు చేయాలని వెంచర్‌ క్యాపిటలిస్టులను కోరారు కేటీఆర్.

కరోనా పరిష్కారాలకు వారంతా మద్దతివ్వాలన్నారు. బెంగళూరులో వెంచర్‌ క్యాపిటలిస్ట్‌లు రూ.100 కోట్లతో నిధి ఏర్పాటు చేశారు. ఈ మేరకు కేటీఆర్‌ కాపిటలిస్ట్‌ వాణి కోలాతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మెడ్‌టెక్‌, మెడికల్‌ డివైస్‌, బయోటెక్‌ రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. కరోనాపై పోరులో భారత్‌ తనదైన ముద్ర వేస్తోందన్నారు.