కరోనా కేరాఫ్ కర్నూల్ అయ్యింది..

కరోనా అంటే కర్నూల్..కర్నూల్ అంటే కరోనా అని అంత మాట్లాడుకునేలా కర్నూల్ లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యం గా కర్నూల్ జిలాల్లో కేసులు విపరీతంగా నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 31 కొత్త కేసులు కర్నూల్ లో నమోదు అయ్యి అందర్నీ షాక్ లో పడేశాయి.

నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 6522 శాంపిల్స్ ను పరీక్షించగా వీళ్లలో 80 మందికి కరోనా ఉన్నట్టు నిర్థారణ అయింది. వీటిలో అత్యథిక కేసులు కర్నూలులోనే నమోదవ్వడం ఆందోళన కలిగిస్తుంది. కర్నూలులో 31 కేసులు నమోదవ్వగా.. గుంటూరులో కొత్తగా 18 కేసులు నమోదయ్యాయి. అనంతపురంలో 6, చిత్తూరులో 14, ఈస్ట్ లో 6, కృష్ణాలో 2, ప్రకాశంలో 2, విశాఖపట్నంలో 2 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 893కు చేరింది.