దేశంలో విస్తరిస్తున్న కరోన కోవిడ్-19 కేసులను అరికట్టడానికి వైద్య శాస్త్రవేత్తల బృందం దేశంలోనే మొట్టమొదటి మొబైల్ కంటైనర్ ల్యాబ్ ను సిద్ధం చేసింది తెలంగాణ సర్కార్. ఈ ల్యాబ్ లో కరోనా నివారణకు వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు పరిశోధనలు చేయనున్నారు. నిమ్స్ ఆస్పత్రి రీసెర్చ్ డెవల్‌పమెంట్ విభాగాధిపతి కె.మధుసూదన్‌రావు ఈ ల్యాబ్‌కు రూపకల్పన చేయగా, ఈఎ్‌సఐ వైద్య కళాశాల డీన్ శ్రీనివాస్, డీఆర్డీవో శాస్త్రవేత్తలు వై.శ్రీనివాస్, ఎంఎ్‌సఆర్ ప్రసాద్, బీహెచ్‌వీఎస్ నారాయణమూర్తి సహకారం అందించారు.
I- clean అనే సంస్థ ఈ రెండు కంటైనర్లలో బీఎస్ఎల్ 3 (బయో సెలెవర్-3) ప్రమాణాలతో కూడిన ప్రయోగశాలను కేవలం 15 రోజుల్లో సిద్ధం చేసింది. సాధారణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో బీఎస్ఎల్ 3 వైరాలజీ ప్రయోగశాలను సిద్ధం చేయడానికి కనీసం 6 నుంచి 7 నెలల సమయం పడుతుంది. అయితే కరోనా వైరస్ ఉద్ధృతి దృష్ట్యా ఈ సంస్థ యుద్ధ ప్రాతిపదికన కేవలం 15 రోజుల్లో ప్రయోగశాలను సిద్ధం చేసింది. ఈ ల్యాబ్ ను కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఆన్లైన్ లో ప్రారభించారు. ఈ కార్య క్రమంలో మంత్రులు కిషన్ రెడ్డి , కేటీఆర్ , సంతోష్ మొదలగు వారు పాల్గొన్నారు.