ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్ కరోనా టెస్టింగ్ మీద కొన్ని రోజులుగా గొడవ నడుస్తుంది. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ఒక్కోటి రూ.337 రూపాయలకే కొన్న కిట్లను ఏపీ సర్కారు రూ.700 చొప్పున పెట్టి కొనడంపై దుమారం రేగింది. దీనిపై పెద్ద రాజకీయం జరుగుతుంది.
ఇప్పుడు మరో షాక్ ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ.. రెండు రోజుల పాటు వాటి వినియోగాన్ని ఆపేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు పది నుంచి 30 నిమిషాల లోపే ఫలితాలు వెల్లడిస్తాయని, . ఐతే వీటి ఫలితాల్లో కచ్చితత్వంపై ముందు నుంచి సందేహాలున్నాయి. ఈ నేపధ్యంలో కిట్ల టెస్ట్ కు బ్రేక్ పడింది.