విజయసాయి రెడ్డిపై పరువునష్టం దావా

బీజేపీ ఫండ్స్ గురించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారని, చంద్రబాబు నుంచి రూ.20 కోట్లు తీసుకున్నానన్న విజయసాయిరెడ్డి ఆరోపణలపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ప్రమాణాలు చేయడం విజయసాయిరెడ్డికి అలవాటేనని, కోర్టులో భగవద్గీతపై కూడా ఆయన ప్రమాణం చేసి ఏం చెబుతున్నారో ప్రజలకు తెలుసని కన్నా వ్యంగ్యంగా అన్నారు.

విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. కన్నా లక్ష్మీనారాయణ అవినీతి వ్యవహారమంతా తనకు తెలుసని , 2019 ఎన్నికల సమయంలో భాజపా అధినాయకత్వం రాష్ట్రానికి ఎంత డబ్బులు ఇచ్చింది.. అందులో ఎంత దుర్వినియోగం జరిగిందనే వివరాలు తన వద్ద ఉన్నాయని ఆరోపించారు విజయసాయి రెడ్డి.