ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామా పంచాయితీలకు వేసిన వైసీపీ జెండా కలర్ పోలిన రంగును వెంటనే తీసేయాలని హైకోర్టు ఏపీ సర్కార్ కు ఆదేశాలు పంపింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అయితే రంగులు తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 3 వారాల గడువు కోరింది. దీనికి అంగీకరించిన ధర్మాసనం ఈ మేరకు గడువిచ్చింది.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ పార్టీ జెండా పోలిన రంగులు వేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కచ్చితంగా రంగులు తొలగించాలని ఆదేశించింది.