కేసీఆర్ ఏం తేల్చుతారో ..


తెలంగాణ కేబినెట్‌ భేటీ ప్రారంభమైంది. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుపై మంత్రివర్గం చర్చించనుంది. ఈనెల 20 నుంచి కొన్ని మినహాయింపులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో తాజా కేబినెట్‌ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

రాష్ట్రంలో.. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించనున్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుపై కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయాలా? వద్దా? అనే అంశాలపై కీలక నిర్ణయాలను తీసుకునే వీలుంది.