ప్లీజ్ జాబ్స్ తీసేయోద్దు : కేటీఆర్

కరోనా ప్రభావంతో విధించిన లాక్‌డౌన్‌ తర్వాత జాబ్స్ ని తొలగించవద్దని పరిశ్రమలు, ఐటీ కంపెనీల అధినేతలను మంత్రి కేటీఆర్‌ కోరారు. ఒక్క ఉద్యోగి కూడా ఉపాధి కోల్పోకుండా చొరవ తీసుకోవాలని కోరుతూ ఆయన లేఖ రాశారు. ఉద్యోగాలు తీసేయకుండా ఖర్చులు తగ్గించుకోవాలని ఆయా కంపెనీలకు సూచించారు.

కాగ గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మహా నగరంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ రోజు కొత్తగా మరో 8 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు జీహెచ్ఎంసీ కమిషనర్‌ లోకేశ్ కుమార్‌ వెల్లడించారు. వీరిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.