జగన్ సర్కార్ బోగస్ లెక్కలు చూపిస్తుందా ?


ఏపీలో ‘కరోనా’ మహమ్మారి విజృంభిస్తున్నా సీఎం జగన్ పట్టించుకోవడం లేదని, ఇతర విషయాలపై దృష్టి పెడుతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. వైకాపా నేతల నిర్వాకం వల్లే ఏపీలో కరోనా విస్తరిస్తోందని ఆరోపించారు. పేదల ప్రాణాలతో ఆడుకునే హక్కు వైకాపాకు లేదన్నారు.

పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ కరోనా కేసుల విషయంలో ప్రభుత్వం వ్యవరిస్తున్న తీరును తప్పుబట్టారు. పాజిటివ్‌ కేసులపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న హెల్త్‌బులెటిన్లలో బోగస్‌ అంకెలున్నాయని ఆరోపించారు. కరోనా కేసులు దాచిపెడితే అత్యంత ప్రమాదమని హెచ్చరించారు. రాష్ట్రంలో చేస్తున్న కరోనా పరీక్షలపై కేంద్రానికి తప్పుడు సమాచారం అందిస్తున్నారని.. జిల్లా యంత్రాంగం లెక్కలు, రాష్ట్ర ప్రభుత్వ లెక్కల్లో తేడాలున్నాయన్నారు