గృహహింసపై సానియా కామెంట్స్


లాక్‌డౌన్‌ వనితలను వణికిస్తోంది. ఇంటిపనులకు ఆటంకంగా మారుతోంది. స్వేచ్ఛను హరించడంతో పాటు మానసికఒత్తిడికి గురవుతున్నారు. కరోనా వైరస్‌ ఆడవాళ్లకు ప్రియమైన శత్రువుగా మారింది.

భర్త, పిల్లలు, పెద్దలు ఇంటికే పరిమితం చేసింది. ఓ వైపు కుటుంబ సభ్యుల్లో ఆప్యాయత, అనురాగాలు పెరిగితే మరోవైపు ఇల్లాలికి కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న దేశాలన్నింటిలో గృహహింస గణనీయంగా పెరుగడం ఆందోళన కలిగిస్తోంది. కాగ ఈ వార్తలు రావడం పట్ల ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఆందోళన వ్యక్తం చేశారు.

“లాక్ డౌన్ సందర్భంగా మహిళలపై దాడులు, గృహ హింస పెరుగుతున్నట్టు వస్తున్న వార్తలు నా దృష్టికీ వచ్చాయి. దీన్ని నేను ఎల్లప్పుడూ ఖండిస్తాను లాక్ డౌన్ రోజుల్లో పురుషులు, మహిళలు అందరూ సంఘటితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆలోచనా ధోరణి మారితే చాలు ” అని అభిప్రాయపడ్డారు.