కోహ్లీని కొట్టమంటున్న అనుష్క


కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ అమల్లో ఉండడంతో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. దాంతో కొందరు వంటలు చేస్తూ, వర్కౌట్లు చేస్తూ ఆ ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. కాగ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య, నటి అనుష్క శర్మ పరోక్షంగా ప్రస్తావిస్తూ ఓ తమాషా వీడియోను పోస్ట్ చేసింది.

లాక్ డౌన్ తో క్రికెట్ సిరీస్ లన్నీ రద్దు కావడంతో.. గ్రౌండ్ నే కాదు లక్షలాది అభిమానులు చూపే ప్రేమను కోహ్లీ మిస్సయ్యాడని అనుష్క ఆ పోస్ట్ లో పేర్కొంది. అభిమానులు చూపే ఆ అనుభవాన్ని తాను ఇస్తానంటూ ఓ ఫన్నీ వీడియోను పోస్ట్ చేసింది. ఓ అభిమానిలా అనుష్క అరుస్తూ.. ‘కోహ్లీ.. ఏయ్ కోహ్లీ.. కోహ్లీ.. చౌకా మార్నా.. చౌకా మార్’ అనడం ఆ వీడియోలో ఉంది. ఈ వీడియో వైరల్ అవుతుంది.