కరోనా క్రైసిస్‌ ఛారిటీ రామోజీ సాయం

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకొనేందుకు రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీ రావు తనవంతు సాయం అందించారు. కరోనా క్రైసిస్‌ ఛారిటీ కి రూ.10లక్షలు విరాళంగా ఇచ్చినట్టు చిరంజీవి వెల్లడించారు. ఈ సందర్భంగా రామోజీరావుకు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు.

టాలీవుడ్‌లోని సినీ కార్మికుల కోసం చిరు చొరవతో ప్రముఖులంతా కలిసి ‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ’ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనికి ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు విరాళాలు ఇచ్చారు. ఈ నగదుతో ఛారిటీలోని సభ్యులు కార్మికులకు నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారు.