ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారిని బుసలు కొడుతుంది. దీంతో లాక్ డౌన్ ప్రకటించిన కేంద్రం ప్రజలను ఇంటికే పరిమితం చేసారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో ను లాక్ డౌన్ ప్రతిష్టం గా నడుస్తుంది. ప్రజలు లాక్ డౌన్ కారణంగా కష్టాలు పడకూడదనే ఉద్దేశ్యం తో ముఖ్యమంత్రి కేసీఆర్ వారికీ కావాల్సిన నిత్యావసరాలు , డబ్బును అందజేస్తున్నారు. అంతేకాదు ప్రజలకి తాను అండగా ఉన్నాననే భరోసా కల్పిస్తున్నారు. ప్రజాశ్రేయస్సే పరమావధిగా పని చేస్తున్న కేసీఆర్పై తెలంగాణ ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజాగా ప్రముఖ నటుడు, రచయిత ఉత్తేజ్.. కేసీఆర్ పరిపాలనపై ప్రశంసలు కురిపించారు. తనలోని రచయితని మేల్కొలుపుతూ కేసీఆర్ని నాయానా అని పిలవాలని ఉంది అని వీడియో ద్వారా తెలియజేశారు. నిన్ను నాయినా అని పిలవాలని వుంది పిలవనా.. మొన్ననిన్ను టీవీలో చూసినంక నీ మాటలు ఇన్నంకా నీ చెయ్యితోని మా కండ్ల నీళ్లు తుడిచినట్టు.. మా భుజాల మీద చేయి వేసి ధైర్యం చెప్పినట్టు.. మా ఇంట్లో మనిషివైనట్టు కొట్టిందే. నిన్ను నాయినా అని పిలవాలనుంది పిలవనా నాయినా. మొన్న నువ్వు ఇచ్చిన భరోసాకు ఆల్లు ఈల్లని కాదు మొత్తం అందరు ఊపిరి పీల్సుక్నురు పానాలు లేచివచ్చినయ్ అన్నరు తెలంగాణ వెన్నుపూసగ నిల్శినవ్ గుండె దమ్మువై నడుస్తున్నవ్ మా బాగోగులు పట్టించుకుంటున్నవ్నిన్ను చూసినా నీ మాటలిన్నా బ్రతుకుమీద నమ్మకం వస్తది.. భయం అన్నది ఆమడ దూరం బోతది. దేన్నైనా జయిస్తాం అనిపిస్తది అంటూ ఉత్తేజ్ తన వీడియోలో పేర్కొన్నాడు.