ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదమూడో సీజన్‌కు ఏదీ కలిసిరావడం లేదు. మార్చి 29న మొదలవ్వాల్సిన లీగ్ ఈ నెల 15కు వాయిదా పడింది. లాక్‌డౌన్‌ను వచ్చే నెల 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్రం మోదీ ప్రకటించడంతో ఐపీఎల్ నిర్వహణపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి.
తాజాగా ఈ క్రికెట్ లీగ్ ను కొన్నిరోజుల పాటు నిలిపివేసిన బీసీసీఐ తాజాగా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఐపీఎల్ తాజా సీజన్ సాధ్యాసాధ్యాలపై బీసీసీఐ చీఫ్ గంగూలీ కొన్నిరోజులుగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నా, నానాటికీ వైరస్ విజృంభణ తీవ్రమవుతుండడంతో కీలక నిర్ణయం తీసుకోకతప్పలేదు. తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకు ఐపీఎల్ ను వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. దేశ ప్రజల ఆరోగ్యం, భద్రతే తమకు అన్నింటికన్నా ముఖ్యం అని బీసీసీఐ కార్యదర్శి జయ్ షా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.