బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సోదరి రంగోలీ చందేల్ ట్విట్టర్ అకౌంట్ మూగబోయింది. ట్విట్టర్ లో రంగోలీ ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా, బాలీవుడ్ అంశాలపై ఘాటు వ్యాఖ్యలతో చురుకు పుట్టిస్తుంటారు. తాజాగా, ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ సంఘటనపై ఆమె ట్వీట్ చేయగా, అది నిబంధనలకు వ్యతిరేకమంటూ ట్విట్టర్ ఘాటుగా స్పందించింది. రంగోలీ అకౌంట్ ను నిలిపివేసింది.
యూపీలోని మొరాదాబాద్ లో ఓ వ్యక్తి మరణించగా, వైద్యపరీక్షలు చేస్తే కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను క్వారంటైన్ కు తరలించేందుకు వైద్య సిబ్బంది, పోలీసులు రాగా స్థానికులు వారిపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి రంగోలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో అకౌంట్ ని బ్లాక్ చేసింది ట్విట్టర్.