దేశ రాజధాని నగరంలో పిజ్జా డెలివరీ బాయ్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలకలం రేపింది. అతడితో కలిసి తిరిగిన మరో 17 మంది డెలివరీ బాయ్‌లను కూడా క్వారంటైన్లో ఉంచామని దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. అలాగే, వారు పిజ్జా డెలవరీ చేసిన 72 కుటుంబాలను కూడా హోం క్వారంటైన్ చేసినట్టు మంత్రి తెలిపారు.
కాగా భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 414 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వెల్లడించింది. బాధితుల సంఖ్య 12వేలు దాటింది. గడచిన 24గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 941 పాజిటివ్ కేసులు, 37మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,380కి చేరింది.