ప్రచవ్యాప్తంగా ఆరోగ్య సంక్షోభం నెలకొన్న సమయంలో.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు నిలిపివేయడం అత్యంత ప్రమాదకరం అని మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్ గేట్స్ తెలిపారు. డబ్ల్యూహెచ్‌వోకు నిధులు నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన చేయగానే.. గేట్స్ ఆ అంశంపై తన ట్విట్టర్‌లో స్పందించారు.
విపత్కర సమయంలో నిధులను ఆపేయడం ప్రమాదకరమవుతుందని గేట్స్ అన్నారు. డబ్ల్యూహెచ్‌వో చేపడుతున్న చర్యల వల్లే కోవిడ్19 వ్యాప్తి అదుపులో ఉందన్నారు. ఈ దశలో వారి పనిని నిలిపివేస్తే, అప్పుడు మరో ఏ సంస్థ కూడా ఆ పనిచేసేందుకు ముందుకు రాదని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచానికి డబ్ల్యూహెచ్‌వో అవసరమని, ఇంతకన్నా మరో మార్గం లేదని గేట్స్ అభిప్రాయపడ్డారు.
కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందనడానికి చైనాలో డిసెంబర్‌లో సరైన ఆధారాలు ఉన్నాయని.. కానీ, డబ్ల్యూహెచ్‌ఓ వాటిపై ఏమాత్రం దృష్టి సారించలేదని ట్రంప్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన నిధులు కూడా నిలిపేశారు.