ఏపీలో జరుగుతుంది ? కేసులు దాచేస్తున్నారా ?


ఏపీలో ‘కరోనా’ కేసులను దాచిపెడుతున్నాని ఆరోపించారు మాజీ సిఏం చంద్రబాబు. ఇది మంచిది కాదని, అలా చేయడం వల్ల ఆ వైరస్ మరింతగా వ్యాపిస్తుందని హెచ్చరించారు. ‘కరోనా’ కేసులను దాచిపెట్టడం వల్ల జరిగే పరిణామాలకు ఉదాహరణ కర్నూలు, నెల్లూరు జిల్లాలేనని అన్నారు .

కరోనా’పరీక్షలకు సంబంధించిన వివరాలపై వైసీపీ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని, అందువల్లే రాష్ట్రంలో ఈ మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని విమర్శించారు. ‘కరోనా’ రోగులను కాపాడే వైద్యులు, వైద్య సిబ్బందికి రక్షణ నిచ్చే ఉపకరణాలు అవసరమని, అవి లేకపోవడం వల్లే వారు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు.

కాగ ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల అంతకంతకూ పెరుగుతూ ఆ సంఖ్య 500 దాటింది. నిన్న సాయంత్రం 5 నుంచి ఉదయం 9 వరకు కొత్తగా 19 కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 502కి చేరింది.