అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు నిధులు అందజేసే విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ దేశం తరఫున అందించే నిధుల్ని పూర్తిగా నిలిపివేయాలని అధికారుల్ని ఆదేశించారు. తొలినాళ్లలో వైరస్ వ్యాప్తిని డబ్ల్యూహెచ్ఓ కావాలనే కప్పిపుచ్చిందన్నది ట్రంప్ ప్రధాన ఆరోపణ.
కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందనడానికి చైనాలో డిసెంబర్లో సరైన ఆధారాలు ఉన్నాయని.. కానీ, డబ్ల్యూహెచ్ఓ వాటిపై ఏమాత్రం దృష్టి సారించలేదని ఆరోపించారు ట్రంప్. పైగా కొవిడ్-19 అంటువ్యాధి కాదన్న చైనా వాదనకు మద్దతుగా నిలిచిందన్నారు. జనవరి రెండో వారం పూర్తయ్యేనాటికీ సామూహిక వ్యాప్తి జరుగుతుందనడానికి అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ.. ప్రపంచాన్ని హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్ నిర్లక్ష్యంగా వ్యవహరించిదని ఆరోపించారు ట్రంప్.