లాక్ డౌన్ మార్గదర్శకాలు విడుదల


గత నెలాఖరున అమల్లోకి తెచ్చిన లాక్‌డౌన్‌ గడువు ముగిసే తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ .. నిన్న జాతినుద్దేశించి ప్రసంగించి దాన్ని వచ్చే నెల 3 వరకూ పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ఈ క్లిష్ట సమయంలో దేశ ప్రజానీకమంతా పాటించాల్సిన ఏడు అంశాలను కూడా ఆయన ప్రస్తా వించారు. అలాగే బుధవారం కొన్ని మార్గదర్శకా లను విడుదల చేయబోతున్నామని మోదీ చెప్పడం… కొన్ని వర్గాల్లో ఆశలు రెకేత్తించింది. ఈ రోజు ఆదేశాలు విడుదల అయ్యాయి.

* ఏప్రిల్‌ 20 నుంచి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, క్రయవిక్రయాలకు, మండీలకు అనుమతి

* వైద్య సేవలకు తప్ప మిగిలిన వాటికి సరిహద్దు దాటేందుకు వ్యక్తులకు అనుమతి నిరాకరణ

* అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలకు 20 మందికి మించి అనుమతి నిరాకరణ

* మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలు నిషేధం

*పాలకు సంబంధించిన వ్యాపారాలు, పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ పరిశ్రమ, టీ, కాఫీ, రబ్బరు సాగును కొనసాగించవచ్చు.
అలాగే హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో ఎలాంటి మినహాయింపులు ఉండవని కేంద్రం ప్రకటించింది.