కరోనా పై గెలవాలంటే అదొక్కటే మార్గం


కరోనా మహమ్మారి నియంత్రణకు పెద్ద ఎత్తున నిర్థారణ పరీక్షలు నిర్వహించడమే మార్గమని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. కేంద్రం కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలు విషయంలో అలసత్వం వహిస్తోందని విమర్శించారు.

‘సరైన సమయంలో భారత ప్రభుత్వం కరోనా టెస్టింగ్ కిట్లు కొనుగోలు చేయలేకపోయింది. ప్రస్తుతం భారత్‌లో వాటి కొరత ఏర్పడే పరిస్థితి తలెత్తింది. ప్రతి లక్ష మందిలో కేవలం 149 మందికి పరీక్షలు నిర్వహిస్తుంటే, భారత్‌ కంటే చిన్న దేశాలైన లావోస్‌ (157), నైగర్‌ (182), హోండురాస్‌ (162) మనకంటే ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కరోనా నియంత్రణకు ఎక్కువ మందికి నిర్థారణ పరీక్షలు నిర్వహించడమే సరైన మార్గం. ఈ ఆటలో ప్రస్తుతం మనం ఏ స్థానంలో ఉన్నాం’’ అని ప్రశ్నించారు రాహుల్.