లాక్‌డౌన్‌ సరే కానీ ప్రభుత్వం చేసేదేమిటి ?


దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను పొడిగించడం అవసరమేనని, ఐతే ఇదే సందర్భంలో కొవిడ్‌-19 కారణంగా స్తంభించిన ఆర్థిక వ్యవస్థ పునర్‌ నిర్మాణానికి ఉద్దీపన పథకం అవసరమని ఆర్ధిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఉదయం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోదీ లాక్‌డౌన్‌ను మే3 వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. గత నెలలో కేంద్ర ప్రభుత్వం రూ.1.7 లక్షల కోట్లతో ఉద్దీపన పథకం ప్రకటించింది. ఇది పూర్తిగా పేద, మధ్య తరగతి వర్గాలకు మేలు చేసిదిగానే ఉంది. పారిశ్రామిక రంగాలకు ఆలంబనగా లేదు. ఈ నేపథ్యంలో రెండో ప్యాకేజీని ప్రకటించాలని వాణిజ్య సంఘాలు కోరుతున్నాయి.

మరోవైపు సామాన్యులు కూడా ఉద్దీపన కోరుకుంటున్నారు. మోడీ చెప్పిన ఏడు సూత్రాలు కూడా ప్రజలపైనే వున్నాయి కానీ ప్రభుత్వం చేసే పని ఏమీ లేదని అభిప్రాయ పడుతున్నారు.