లాక్ డౌన్ పొడిగింపు ఓ గేమ్ చేంజర్


దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను మే 3వరకు పొడిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు బుధవారం మార్గదర్శకాలు విడుదల చేయనుంది. దేశంలో ఒక్క హాట్‌స్పాట్‌ కూడా పెరగకుండా చూసుకోవాలని ప్రధాని మోదీ కోరారు.

కాగా కరోనాపై భారతావని చేస్తున్న పోరాటంలో లాక్ డౌన్ ను పొడిగించాలన్న ఆలోచన కేవలం ఓ గేమ్ చేంజర్ అని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వ్యాఖ్యానించారు.

మార్చి 24 అర్థరాత్రి నుంచి లాక్ డౌన్ విధించిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన, కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు సానుకూలంగా స్పందించారని, వచ్చే 19 రోజులూ అదే విధమైన సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. ఏప్రిల్ 20 తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సిన లాక్ డౌన్ వ్యూహంపైనా కేంద్రం నుంచి సలహాలు, సూచనలు అందుతాయని, ఆపై రాష్ట్రాల్లోని పరిస్థితులకు అనుగుణంగా, ఆయా ప్రాంతాల్లోని సౌలభ్యాల ప్రకారం నిర్ణయాలు తీసుకోవచ్చని జవదేకర్ సూచించారు.