శ్రియ భర్తకు కరోనా లక్షణాలు


తన భర్త ఆండ్రీకి కరోనా లక్షణాలున్నాయని శ్రియ చెప్పింది. తన భర్త పొడి దగ్గు, జ్వరం తదితరాలతో బాధపడుతూ ఉన్నారని, ముందు జాగ్రత్తగా ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్ అయిపోయి, ప్రత్యేక గదిలో ఉంటున్నాడని చెప్పింది. తన భర్తలో ఈ లక్షణాలు కనిపించడంతో ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యానని , . ప్రస్తుతానికి ఎటువంటి ఇతర అనారోగ్య సమస్యలూ లేవని, ఒకవేళ ఎదురైతే ఆండ్రూను ఆసుపత్రికి తరలిస్తామని వెల్లడించింది.

రష్యాకు చెందిన క్రీడాకారుడు ఆండ్రీని శ్రియ 2018 మార్చిలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా ఆమె నటిగా సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం భర్తతో కలిసి స్పెయిన్‌లో ఉంటున్నారు. ఆ దేశంలో కూడా కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో లాక్‌డౌన్‌ విధించారు.