కరోనా ఫ్రీ టెస్టులు.. వాళ్లకి మాత్రమే


కరోనా నిర్ధారణ పరీక్షలు అందరికీ ఉచితంగా నిర్వహించాలని గతవారం పేర్కొన్న సుప్రీం కోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన నిర్ణయాన్ని సవరించుకుంది. కరోనా టెస్టులు పేదవారికి మాత్రమే ఉచితంగా చేయాలని స్పష్టం చేసింది. ఎవరెవరికి ఉచితంగా కరోనా టెస్టులు వర్తింపజేయాలో ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని సూచించింది.

కాగా భారత్ లో గత 24 గంటల్లో కొత్తగా 796 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. చికిత్స పొందుతూ 34 మంది మరణించారని వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 9,152కు పెరిగిందని తెలిపింది. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు.