కరోనా మహమ్మారిపై పోరాటం సహా లాక్‌డౌన్‌తో ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకోవడమే లక్ష్యంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ రూ.5కోట్లు సాయం చేశారు. విరాళాల విషయంలో కార్పొరేట్ సంస్థలకు అత్యంత విశ్వసనీయమైన ‘గివ్ ఇండియా’కు తన విరాళం అందజేశారు. గూగుల్ సీఈవో తన వంతుగా రూ.5కోట్లు ఇచ్చారని గివ్ ఇండియా ట్విటర్‌లో వెల్లడించింది.
కాగా కరోనా మహమ్మారిపై ఏపీ సర్కార్ చేస్తున్న పోరాటానికి ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ తన వంతు సాయం అందించారు. ఈ మేరకు ఏపీ సీఎం సహాయ నిధికి అదానీ ఫౌండేషన్ తరఫున రూ.2కోట్లు సాయం అందజేసినట్టు ఆయన ట్విటర్‌లో వెల్లడించారు.