ఏపీ సర్కార్ కి హైకోర్ట్ డెడ్ లైన్


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమంటూ.. హైకోర్టులో పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. స్వయంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా.. శుక్రవారమే పిటిషన్ దాఖలు చేశారు. అంతకు ముందు యోగేష్ అనే వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

కాగా రమేష్ కుమార్ తొలగింపుపై కౌంటర్ దాఖలు చేయడానికి ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది.. ఏకంగా నెల రోజులు కావాలని హైకోర్టును కోరారు. అయితే.. హైకోర్టు మూడు రోజులు మాత్రమే సమయం ఇచ్చింది. మూడు రోజుల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వచ్చే సోమవారం..తదుపరి విచారణ చేపడతామని తెలిపింది.