చైనాలో మళ్ళీ తిక్క చూపిస్తున్న కరోనా.. లాక్ డౌన్ తప్పదా ?


కరోనా వైరస్‌ ఒక పట్టాన అర్ధం కావడం లేదు. లక్షణాలు వుండవు. కానీ పాజిటివ్ వస్తుంది. అంతేకాదు తగ్గినా మళ్ళీ వస్తుంది. ఇప్పుడు చైనాకి ఈ తల నొప్పి మళ్ళీ పట్టుకుంది. ఆదివారం ఒక్కరోజే 108 కొత్త కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. వీటిలో 98 మంది విదేశాల నుంచి వచ్చినవారేనని అక్కడి అధికారులు చెబుతున్నారు.

వీరి సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో చైనాలో వైరస్ విజృంభణ రెండో విడత ప్రారంభమయ్యే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన కేసుల సంఖ్య 1,378కు పెరిగింది. ఇక లక్షణాలు లేకుండా వైరస్‌ సోకినవారి సంఖ్య 1,064కు చేరింది. ఈ పరిణామాల నేపథ్యంలో క్రమంగా ఆంక్షల సడలించాలన్న నిర్ణయం మరికొన్ని రోజులు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.