సోనమ్‌కపూర్ కు కౌంటర్ ఇచ్చింది యాంకర్ రష్మి. కరోనా కల్లోలాన్ని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా 21రోజులపాటు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోనమ్ కపూర్.. ఇంట్లో చాక్లెట్ కేక్‌ను తయారుచేశానని.. అయితే కేక్ తయారుచేసే సమయానికి తన ఇంట్లో చాక్లెట్స్ అయిపోయాయని కాకపోతే ఫార్చ్యూన్ గార్మెంట్ ఇండియా సంస్థ తాను అడిగిన వెంటనే తనికి చాక్లెట్ పంపించారని తెలియచేస్తూ తన సోషల్‌మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.
దింతో రష్మి వళ్ళు మండింది. ” ఫార్చ్యూన్ గార్మెంట్ ఇండియా.. మీరు ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఆమె కేక్ బేకింగ్‌కు కావాల్సిన పదార్థాలను అందించడం అంత ముఖ్యమా?” అని చురక అంటించింది రష్మీ. లాక్డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు ఇలా పోస్టులు పెట్టి వార్తల్లో నిలుస్తున్నారు.