నకిలీ వార్తని కొట్టిపారేసిన రతన్‌ టాటా


కరోనా ప్రభావంతో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లనుందని నిపుణులు భావిస్తున్నారని తాను చెప్పినట్లుగా వస్తున్న వార్తలను పారిశ్రామిక వేత్త, టాటా సంస్థ ఛైర్మన్‌ రతన్‌ టాటా తీవ్రంగా ఖండించారు.

‘కరోనా కారణంగా భారీ స్థాయిలో ఆర్థిక పతనం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. నిపుణుల గురించి అయితే నాకు పూర్తిగా తెలియదు. కానీ మానవుల స్ఫూర్తి, శ్రమ విలువ వారికి కచ్చితంగా తెలియదని నా అభిప్రాయం’’ అని రతన్‌ టాటా చెప్పారని ఓ వార్త సంస్థ ప్రచురించింది.

దీనిపై ఆయన ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘‘అలా నేను చెప్పలేదు, రాయలేదు. వాట్సాప్, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తల్లో నిజమెంతో మీడియా ధ్రువీకరించాలని కోరుతున్నా. నేను ఏమైనా చెప్పాలని భావిస్తే ప్రముఖ ఛానెళ్లతో నేరుగా చెబుతా” అని ట్వీట్ చేసారు