లాక్‌డౌన్ కట్టుదిట్టంగా అమలు చేయడం వల్లే కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఉందని విజయ్ దేవరకొండ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో లాక్‌డౌన్ సక్రమంగా అమలవుతోందని ఈ విషయంలో పోలీసుల పాత్ర గొప్పదని ప్రశంసించారు.
బషీర్‌బాగ్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులకు ఫేస్ మాస్కులు, సేఫ్టీ గ్లౌజులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. నేను బయటి ప్రపంచాన్ని చూసి 20 రోజులు అవుతోంది. లాక్‌డౌన్ వల్లే ఈ రోజు పరిస్థితి అదుపులో ఉంది. ఈ విషయంలో పోలీసుల పాత్ర గొప్పది. ఇంట్లో లాక్‌డౌన్ పాటిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. లాక్‌డౌన్ పాటించని వారు దయచేసి పాటించాలి’అని విజ్ఞప్తి చేశారు.
ThanQ Vijay @TheDeverakonda
For coming to support us #InFightAgainstCovid19 on
behalf of Tollywood. Where a single word of appreciation inspire us tonnes of times,ur representing here millions of hearts Industry&Audience who admire', I think there won't b perfect unit to measure pic.twitter.com/EEDgKk8FqK— DGP TELANGANA POLICE (@TelanganaDGP) April 11, 2020