అచ్చన్న లాగిన లాజిక్ బావుంది

లాక్ డౌన్ సమయంలో దేశంలోనే అత్యధిక కరోనా కేసులున్న రాష్ట్రాల్లో ఒకటైన తమిళనాడు నుంచి.. నేరుగా.. ఎస్‌ఈసీగా పదవి చేపట్టడానికి జస్టిస్ కనగరాజ్ ఎలా వచ్చారని లాజిక్ లాగారు మాజీ మంత్రి అచ్చన్న.

”క‌రోనా ప్ర‌భావం వృద్ధుల‌పై ఎక్కువ‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నా 84 ఏ‌ళ్ల కనగ‌రాజ్‌ని తీసుకొచ్చారు. ఆయ‌నేమైనా క‌రోనా క‌ట్ట‌డి చేసే శాస్ర్త‌వేత్తా? వైద్యుడా? బాధ్య‌త‌లు స్వీక‌రించేట‌ప్పుడు మాస్క్ కూడా పెట్టుకోని ఆయన రాష్ట్ర ప్ర‌జ‌ల ప్రాణాల‌తోనూ చెల‌గాటమాడుతున్నారు.” అని ట్వీట్ చేశారు అచ్చన్న.