తన తల్లిపై వచ్చిన వార్త పై చిరు క్లారిటీ


కోరానాపై పోరులో అందరూ భాగం అవుతున్నారు; ఈ వారసులో చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా కోరానాపై పోరులో తాను సైతం అంటున్నారని… తన స్నేహితురాళ్లతో కలిసిన 700 మాస్కులు కుట్టారంటూ వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వార్త తెలిసి ప్రతి ఒక్కరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అయితే దీనిపై చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.

మానవతా ధృక్పధంతో తన తల్లి ఈ పని చేశారంటూ వార్తా చానళ్లలో వచ్చిందని… అయితే ఆమె తన తల్లి కాదని చిరంజీవి తెలిపారు. ఆమె ఎవరైనా… ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానని చెప్పారు. కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మేనంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్.