రవి.. శ్రీముఖి .. సీక్రెట్ రిలేషన్ రూమరే


రవి.. శ్రీముఖి .. టాప్‌ ర్యాంకర్లు. ఫటాఫట్‌ పంచులతో.. ధనాధన్‌ డైలాగ్‌లతో యూత్‌ను ఫిదా చేశారు. ఐతే వీళ్ళ మధ్య రుమార్లు కూడా వచ్చాయి. ఇద్దరి మధ్య ఎదో కెమిస్ట్రీ ఉందని, సీక్రెట్ రిలేషన్ షిప్ లో వున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా రవి దీనిపై స్పదించాడు.

” సాధారణంగా ఒక షో చేసేటప్పుడు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడానికి, ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం, దగ్గరకు తీసుకోవడం చేస్తుంటాం. అలాంటివన్నీ సినిమాల్లోనే చూసిన ప్రేక్షకులు మా మధ్య ఏదో ఉందని అనుకుంటారు. అంతే తప్ప మా మధ్య ఏమీ లేదు” అని చెప్పుకొచ్చాడు రవి.