కరోనా పై ట్రంప్ రాజకీయాలు అంటున్న డబ్ల్యూహెచ్‌వో

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కి తిక్క రేగింది. కరోనా విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పై ఆయన నిప్పులు చెరిగారు. కరోనా గురించి డబ్ల్యూహెచ్‌వో చెప్పిన ప్రతి విషయం తప్పేనని, కరోనా పుట్టిన చైనాలో ఏం జరుగుతోందో ఆ సంస్థకు తెలుసని, అయినప్పటికీ వైరస్‌ తీవ్రతను ఎందుకు అంచనా వేయలేకపోయారని ట్రంప్ మండిపడ్డారు. అంతేగాక, డబ్ల్యూహెచ్‌వో పూర్తిగా చైనాకు అనుకూలంగా వ్యవహరించిందని, అమెరికా ఆ సంస్థకు భారీగా నిధులిస్తుందని హెచ్చరించారు.

ఐతే ఈ విషయంలో డబ్ల్యూహెచ్‌వో చీఫ్, డైరెక్టర్‌ జనరల్‌ అధనామ్ ఘెబ్రేయేసస్ స్పందించారు. కొవిడ్‌-19 మహమ్మారితో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు ఘెబ్రేయేసస్ తమ సంస్థ తమ బాధ్యతలను సమర్థవంతంగానే నిర్వర్తిస్తోందని, . అమెరికా నిధులు ఆపేయడానికి ఇది సరైన సమయం కాదని, వైరస్ విజృంభిస్తోన్న సమయంలో నిధుల కొరత సృష్టించడం సరికాదని, రాజకీయ దురుద్దేశంతో వ్యాఖ్యలు చేయొద్దని ఆయన చెప్పుకొచ్చారు.