ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కరోనా నియంత్రణ ఫై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పటు చేసారు. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రి కురసాల కన్నబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మహమ్మారి విపరీతంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ఏం చేయాలి..ప్రస్తుతం ఏ ఏ జిల్లాల్లో ఎలా ఉంది..ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి పరిస్థితి ఎలా ఉంది..లాక్ డౌన్ విషయంలో ఏం చేయాలి అనే వాటిపై జగన్ అధికారులతో , మంత్రులతో చర్చ జరుపుతున్నట్లు సమాచారం.