మొదట్లో ఇండియా లో కరోనా కేసులు పెద్దగా నమోదు కాలేదు. ఎప్పుడైతే మర్కజ్ ప్రార్థనలు జరిగాయో..అక్కడి నుండి వారు వచ్చారో అప్పటి నుండి దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. ఈ జిల్లా..ఆ జిల్లా అనే తేడాలు లేకుండా అన్ని జిల్లాల్లో ఈ వైరస్ విస్తరించింది. తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. మర్కజ్‌బాధితుల నుంచి వారి కుటుంబ సభ్యులకు.. వాళ్లనుంచి బంధు మిత్రులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది.
ఇలాంటి కేసులు మెల్లమెల్లగా ఆయా రాష్ట్రాల్లో బయట పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి సస్పెన్స్ కేసులే ఎనిమిది దాకా లెక్కతేలాయట.. మున్ముందు అన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే ఎదురయ్యే ప్రమాదం ఉన్నట్లు డాక్టర్లు, నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి మూడో దశ ప్రారంభంలో ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో కమ్యూనిటీ సర్వైలెన్స్, వ్యాధి నిర్ధారణ పరీక్షల సామర్థ్యం పెంపు, భవిష్యత్ అవసరాల మేరకు ఆస్పత్రులను సిద్ధం చేయడం వంటి చర్యలు తీసుకుంటోంది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఇలాఉంటే.. ఇక దేశంలోని కరోనా హాట్ స్పాట్స్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన అందరిలో నెలకొంది.