దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఎంతగా పెరుగుతున్నాయో చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజ్ర్బిస్తుంది. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు అమాంతం పెరుగుతుండడం తో ప్రభుత్వానికి ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ఈ నేపథ్యంలో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ.. ముంబై నగర పాలక సంస్థ నిర్ణయం తీసుకుంది.
ఇళ్ల నుంచి బయటకు వచ్చే ప్రజలు కచ్చితంగా ముఖానికి మాస్క్ ధరించాల్సిందేనని ముంబై నగర పాలక సంస్థ సూచించింది. మాస్కులు లేకుండా బయటకు వస్తే శిక్ష తప్పదని హెచ్చరించింది. ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 ప్రకారం బీఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది.