తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం నుంచి ఇప్పటి వరకు 49 కేసులను కొత్తగా గుర్తించినట్లుగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మీడియా తో మాట్లాడిన ఆయన..తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 453కి చేరింది. వీరిలో 11 మంది మృతిచెందగా.. 45 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 397 మంది చికిత్స పొందుతున్నట్లుగా మంత్రి వెల్లడించారు.
ప్రస్తుతం 397మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వాళ్లంతా ఆరోగ్యంగానే ఉన్నారని ఈటల రాజేందర్ వెల్లడించారు. కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన అన్ని ప్రత్యేక ఆస్పత్రుల్లో సకల సదుపాయాలు కల్పించడంతో పాటు వైద్యులకు కావాల్సిన సమగ్ర సామగ్రిని, కిట్లను అందజేసినట్లు మంత్రి తెలిపారు.