బోల్ బచ్చన్ షురూ కానుంది!

venkatesh-ramఅజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్ కలసి నటించిన ‘బోల్ బచ్చన్’ తెలుగు రీమేక్ ను మార్చి 13 న లాంచ్ చేసి, మార్చి 22నుండి రెగ్యులర్ షూటింగ్ చేయనున్నట్టు సమాచారం. వెంకటేష్, రామ్ కలిసి నటించబోతున్న ఈ చిత్రానికి విజయ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ తరువాత వెంకటేష్, విజయ భాస్కర్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రమిది. ఈ చిత్రాన్ని స్రవంతి రవి కిషోర్ మరియు డి. సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగు టైటిల్ ఖరారు కాల్సివుంది.