కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరు సాయం అందిస్తున్నారు. కరోనా కారణంగా ఆర్ధికంగా నష్టపోయిన వారికోసం తమవంతు గా సినీ , రాజకీయ , క్రీడా , బిజినెస్ ఇలా ప్రతి ఒక్కరు ఆర్ధిక సాయం అందిస్తున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది పెద్ద మొత్తంలో విరాళాలు ప్రకటి తమ గొప్ప మనసు చాటుకోగా..తాజాగా తెలుగు నిర్మాతల మండలి కూడా కరోనా పై పోరాటంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి రూ.25 లక్షల విరాళాన్ని అందజేసారు.
ఈ విరాళాన్ని ప్రముఖ నిర్మాత పద్మాలయా స్టూడియోస్‌పై పలు చిత్రాలను నిర్మించిన సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు జి.ఆదిశేషగిరి రావుతో పాటు క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై పలు చిత్రాలను నిర్మించిన కే.యస్.రామారావు ఈ విరాళాన్ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు అందజేసారు.