రోడ్ల పైకి కరోనా కార్..చూస్తే పరేషాన్

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కోరోమా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ మాత్రమే కాదు ప్రజల్లో ఇంకాస్త కరోనా ఫై అవగాహనా తేవాలని డిసైడ్ అయ్యింది. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు.. కరోనా హెల్మెట్లతో నగర వాసుల్లో అవగాహన తీసుకొస్తుండగా..తాజాగా కరోనా కార్ ను కూడా తీసుకొచ్చారు.


ప్రభుత్వంతోపాటూ… స్వచ్ఛంద సంస్థలు కూడా ఇలాంటి ప్రచారాలు చేస్తుండగా..తాజాగా హైదరాబాద్‌కు చెందిన సుధాకార్స్ మ్యూజియం చీఫ్ సుదాకర్… కరోనా వైరస్ రూపంలో కారును తయారుచేశారు. ఇది వరకు ఈయన బర్గర్ కారు, క్రికెట్ బాల్ కారు, క్రికెట్ బ్యాట్ కార్లను తయారుచేశారు. కరోనాపై ప్రజలల్లో అవగాహన పెంచేందుకు ఇలా చేసినట్లు తెలిపారు. ఈ కార్ తో జనాల్లో ఇంకాస్త అవగాహనా రావడం ఖాయం అంటున్నారు .