లాక్ డౌన్ ఎఫెక్ట్ : మద్యం దొరక్కపోవడం తో కోమాలోకి వెళ్లిన మహిళా

కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా నిత్యావసరాల షాప్స్ , మెడికల్ షాప్స్ ఇవి మాత్రమే ఓపెన్ కాగా మిగతావన్నీ మూతపడ్డాయి. ముఖ్యంగా వైన్ షాప్స్ బంద్ కావడం తో మందు బాబుల కష్టాలు అన్ని ఇన్ని కావు. మందు కు బానిసైన వారు గత కొన్ని రోజులుగా మద్యం దొరకకపోయేసరికి పిచ్చి పట్టినట్లు, మతిస్తిమితం కోల్పోయినట్లు ప్రవర్తిస్తున్నారు. మరికొన్ని చోట్ల తట్టుకోలేక ఆత్మహత్యలు, చాకులతో గొంతు కోసుకుంటున్న ఘటనలూ వెలుగు చూస్తున్నాయి.

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఏకంగా ఓ మహిళా మద్యం దొరక్కపోవడం తో కోమాలోకి వెళ్లిన ఘటన చోటు చేసుకుంది. మామిడికుదురు మండలం పాశర్లపూడి శ్రీరామ్‌పేటకు చెందిన బొమిడి మంగమ్మ నిత్యం మద్యం సేవించేది. లాక్‌డౌన్ కారణంగా గత 15 రోజులుగా మద్యం దొరక్క అల్లాడిపోయింది. రోజురోజూకీ ఆమె ఆరోగ్యం అస్వస్థతకు దారి తీస్తోంది. ఈ క్రమంలోనే నరాలు లాగేయడంతో కోమాలోకి వెళ్లిందని కుటుంబ సభ్యులు తెలిపారు. రాజోలు ప్రభుత్వాస్పత్రికి మంగమ్మను కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో రాజోలు వైద్యులు కాకినాడ జీజీహెచ్‌కు రిఫర్ చేశారు. కుటుంబ సభ్యులు ఆమెను జీజీహెచ్‌కు తరలించడగా, పరీక్షించిన వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తేల్చిచెప్పారు.