మహారాష్ట్రలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజ్ర్బిస్తుంది. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు అమాంతం పెరుగుతుండడం తో ప్రభుత్వానికి ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. గడచిన 24 గంటల్లో 150 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,018కు చేరింది.
ఒక్క ముంబై మహానగరంలోనే 116 మందికి పాజిటివ్‌గా తేలడంతో సిటీలో కేసుల సంఖ్య 590కి చేరింది. కరోనా కారణంగా 40 మంది చనిపోయారు. పుణెలో 8, నాగ్‌పూర్‌లో 3 కొత్త కేసులు నమోదు అయినట్లు తెలుస్తుంది.