మటన్ వ్యాపారికి కరోనా ..కొనుగోలు చేసిన వారి కోసం గాలింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. ఇప్పటికే 300 కు పైగా కేసులు నమోదు కావడం తో ప్రజలంతా భయాందోళనలో పడ్డారు. తాజాగా విశాఖ జిల్లా గాజువాకలో ఓ మటన్ వ్యాపారికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఇతడు కూడా ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మర్కజ్ కు వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత శ్రీకాళహస్తిలో జరిగిన ఒక మత సమ్మేళనంలో కూడా పాల్గొనడం జరిగింది.

అయితే అక్కడికి వెళ్లి వచ్చిన వారిని టెస్ట్ లు చేయించుకోమని చెబుతున్నా వినకుండా మటన్ దుకాణం తెరిచాడు. ఏకంగా ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చికెన్ విక్రయించాడు. దీంతో అతడి వద్ద చికెన్ కొనుగోలు చేసినవారిని గుర్తించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. అతని వద్ద మాంసం కొనుగోలు చేసిన 14 మందిని గుర్తించినట్లు సమాచారం. మరింత మంది కోసం ఆరా తీస్తున్నారు.